మోడీకి మరో పిలుపొచ్చింది
ఉత్తేజపూరితమైన ప్రసంగాలివ్వడంలో దిట్టని పేరు తెచ్చుకున్న గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి అమెరికా వర్గాల నుంచి ఆహ్వానం అందింది. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న అమెరికా రాజకీయ, వాణిజ్య ప్రతినిధులు ఈరోజు మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు గుజరాత్ లో మోడీ పాలనకు కితాబిచ్చారు. ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు అమెరికా రావాలని మోడీని కోరగా, వారి విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమం వచ్చే జూన్ లో ఉండనున్నట్టు సమాచారం. ఇంతకుముందు, మోడీ వార్టన్ సదస్సులో ప్రసంగించాల్సి ఉండగా, వివిధ కారణాలరీత్యా ఆయన ప్రసంగం రద్దయింది. అనంతరం, అమెరికాలోనే జరిగిన 'డయాస్పోరా' కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.